Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

జ్ఞానంవల్లనే దుఃఖనాశనం

మన దోషాల నెత్తి చూపినవారిపై మనకుసామాన్యంగా కోపం వస్తుంది. నిజానికి మన దోషాన్నింటినీ వారెరుగరు. ఎరిగివుంటే మరీ నిందిస్తారు. ఎవరి దోషాలు వారికే బాగా తెలుస్తవి. కనుక ఎవరిని వారే నిందించుకొని, సరిదిద్దుకోవలసి వుంటుంది. అలా చేయక, మన దోషాలను కప్పి పెట్టుకొంటాము. తప్పుచేసినపుడు పశ్చాత్తాపము చెంది, ఆ తప్పును పరిహరించుకోవాలిగాని, దాచిపెట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఏనాటి కానాడు నిజదోషములను పారజూచుకుంటే ఆత్మ పరిశుద్ధికి మార్గ మేర్పడుతుంది. అలా నిజదోషాలను గ్రహించిసరిదిద్దు కొనే శక్తిని జగదంబ మన కనుగ్రహించుగాక అని వేడుకొందాము.

పాపాచరణం చేసేవాణ్ణి సంస్కృతంలో పతితుడు అంటారు. జారిణిని తమిళంలో నరుక్కి అంటారు. ఈ రెంటికి కాలుజారి పడటమనే అర్థం. కాలుజారి పడటమనేది ఎవరికైనా వస్తుంది. పడిపోవటానికి పెద్ద ప్రయత్న మేమీ అక్కరలేదు. అలాపడిపోకుండా నిబ్బరించుక. నిలువద్రొక్కుకునేవారునూటి కొక్కరున్నా. అట్టివారి సచ్చీలం లోకానికి మార్గదర్శక మవుతుంది. అట్టి సచ్చరిత్రులను లోకం కొనియాడుతుంది.

కష్టాలు అందరికీ కలుగుతవి. కష్టాలు కలిగినపుడు భగవంతుణ్ణి నిందిస్తాము - మన కష్టాలను పట్టించుకొనుటలేదని. భగవదనుగ్రహంవల్లనేమనకన్న వస్త్రాలు. నిలువనీడా లభిస్తున్న వనేమాట అప్పుడు మరచిపోతాము. ఆ సుఖాలను కల్గించినందుకు సంతోషించడం మాని, కష్టాలువచ్చేసరికి వాటినిభరించలేక నిందిస్తాము. ఈ కష్టాలు గూడ మన మేలుకే వచ్చినవని గ్రహించలేము. మన్నుదినే బిడ్డచేతులను తల్లి కట్టివేస్తుంది. కట్టివేసినందుకు బిడ్డ ఏడుస్తుంది. తల్లి నవ్వుకొంటుంది. మనకు కలిగే మేళ్లు ఈశ్వరుని నిర్హేతుక కటాక్షంవల్లనే లభిస్తున్నవి. కష్టాలుకూడా ఏదో కారణంవల్లనే కల్పిస్తాడు భగవంతుడు. మన కా కష్టాలే కనిపిస్తవికాని కారణం కనిపించదు. మనం వర్తమానాన్నే చూస్తాముగాని భూతమును, భవిష్యత్తును చూడలేము కనుక వర్తమానం కోసం దుఃఖిస్తాము. మనమేలు కోసమే కష్ఠాలనుకల్పించడమనేది ఈశ్వరవిలాసం. వెనుకముందులు పారజూచుకొనే నేర్పేవుంటే మనజీవితంలోకష్టాలకంటే సుఖములే మనపాలి కధికంగా వచ్చినపని స్పష్టపడుతుంది. ఈ కష్టాలనేవి మనలోవున్న పాపమనే రోగాని కౌషధంవంటివనీ దుఃఖానుభవమువల్ల పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందనీ అపుడు తెలిసికొంటాము. జ్ఞానవైరాగ్యముల సహాయ్యంతో దుఃఖములనుభవించే శక్తిని ప్రసాదింపుమని ఈశ్వరుని ప్రార్ధించుదాము. భక్తులైనవారు దుఃఖములచే కుంగిపోరు.

దుఃఖహరణానికి జ్ఞానమే పరమౌషధం. తనకు వచ్చిన కష్టాలు మరియెవరికి రాలేదని యెవరికివారే అనుకొంటారు. ధనవంతులకు, ఉన్నతపదస్థులకు దుఃఖాలు లేవని మన మనుకొంటాము. వారినే అడిగి చూడండి, తమ కష్టాలొక్కొక్కటే ఏకరువు పెట్టుతారు. మనమున్న ఉనికితో తృప్తిచెందము. అంతకంటే అధికపదవిలో సౌఖ్యమున్నదనుకొంటాము. తీరా ఆ పదవిని పొందిన పిమ్మట తెలుస్తుంది. అదికూడా కంటకమయమే అని. యథార్థమేమటంటే-మన మేస్తితిలో వున్నా కష్ఠాలనేవి తప్పవు. అవి పూర్వజన్మములందు మనమార్జించుకొన్నవి. పూర్వభవకర్మల నుండి మన చిట్టాల కెక్కినవుతారు. (బ్రాటోవరు) లవి అవి. మనలను వెంటాడుతవి. అనుభవం వల్ల తప్ప అవి నశింపవు.

ఉన్మత్తులకు, జడులకు మనకున్నట్లు దఃఖానుభవం ఉండదు. జ్ఞానులకుకూడా దుఃఖము లంటవు. ఉన్నాదము, జడత్వము పూర్వకృత పాపంవల్లనే కలుగుతవి. అనుభవం వల్ల ఆ పాపఫలం నశించగానే జడత్వం వదలిపోతుంది. అంతట వానికిగూడా మనకందరకువలెనే దుఃఖానుభవం కలుగుతుంది.

గాఢసుషుప్తియందు మనకు దుఃఖానుభవం ఉండదు. అట్టి నిద్రనుండి లేచి ''ఆహా! ఎంతసుఖంగా నిద్రపోయాను!'' అనుకుంటాము. జ్ఞానులు మేలుకొనివున్నా వారికి దుఃఖ మంటదు కనుక వారి కా మెలుకువ సుషుప్తివంటిదే అనాలి. దుఃఖములు చుట్టుకున్నా జ్ఞానులు, మనం సుషుప్తిలోపొందే సుఖాన్నే పొందుతూవుంటారు. అంటే - వారి శరీరములకు బాధ కలుగదని కాదు, ఆ బాధ వారి మనస్సునంటదు. దుఃఖములచే వారు వ్యధచెందరు. ఆ భారముచే మనవలె క్రుంగిపోరు. బరువైన దారుఖండం పదిమంది పట్టితేకాని కదలదు. దానినే నీటిలోవేస్తే పసివాడుకూడా దాని నిట్టే కదిలించగలడు. కాబట్టి మన దుఃఖాలను జ్ఞానజలమందు ముంచితే చాలు, అవి ఇట్టే తేలికైపోతవి.

మరి అజ్ఞాన మెట్టిది అంటే- విషయముల యధార్థాన్ని గ్రహించుటే జ్ఞానం. కనపడుతున్న జగత్తును గ్రహించుటకు సైన్సుకూడా పరిశ్రమచేస్తున్నది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ యీ మొదలైన శాస్త్రములందు పరిశోధనలు చేసే సైంటిస్టు జ్ఞానతృష్ణలో మునిగి తనకష్టాలను మరచిపోతాడు. సంగీతరసమందు మునిగినవారు కూడా తమ కష్టాలను మరచి పోతారు. అయితే, ఈ మరపు తాత్కాలికమే కాబట్టి దుఃఖాన్ని చప్పగా తుడిచిపెట్టదు, అట్టి దుఃఖనాశనం పరమార్థజ్ఞానం వల్లనే కలుగుతుంది.

విషయస్వరూపాన్ని ఏమాత్రం గ్రహించినా కొంత దుఃఖం నివారణ మవుతుంది. కొందరు కష్టాలను బొత్తిగా సహించలేరు. మరికొందరు ఆ కష్టాలనే అంతగా లక్ష్యపెట్టక తిరుగుతూవుంటారు. అట్టివారిని మనం ఓదార్చబోతే కష్టాలకేమిలెండి. ఏవో వస్తవి. పోతవి. అని త్రోసిపుచ్చుతారు. ఆ నిబ్బరమే కష్టకాలమందు వారికి ధైర్యాన్ని, సహనాన్ని ఇస్తూవుంటుంది. కష్టాలు కాపురముండవు, ఈనాటి దుఃఖాలు ఇంకోనాటికి గణనకురావు, కాలమే అన్నిదుఃఖాలనుమాన్పుతుంది. జ్ఞానియైనవాడు నేటి కష్టాలను, మరి ముప్పదేండ్లు ముందుకు వెళ్లి చూచి నవ్వుకుంటాడు. అలా చూచినపుడు దుఃఖములంతగా బాధించవు. జ్ఞానులది తస్థదృష్టి తమబాధ లింకెవరివో, ఎచటివారివో అన్నట్లు దేశకాలాలకు దవ్వుగా నిలచి వారు చూస్తారు.

తన దుఃఖములను పట్టించుకొనడు గనుక జ్ఞాని ఇతరుల దుఃఖాలనుగూడ పట్టించుకో డనుకోగూడదు. సకలజీవులు పరమాత్మస్వరూపులే అని యెరిగినవాడు గనుక అతడు ఆర్తసేవనం తనకు విధాయకంగా ఎంచుకొంటాడు. అతనికి రాగద్వేషములు, స్వపరభేదములు లేవు. బొమ్మల కొలువులో బొమ్మలన్నీ మృన్మయమే అయినట్లు జీవకోటి అంతా జ్ఞానికి పరమాత్మమయమే. కావున ఎపరిపట్లను ఆసక్తివహింపక ధర్మ బుద్ధితో లోకారాధనం చేస్తాడు. న్యాయస్థానంలో ధర్మాధికారికి నిందితులపట్ల ధర్మదృష్టేతప్ప స్వపరభేధం ఉండదుకదా! దుఃఖాలలో మునిగినవారికి, తనకున్న జ్ఞానాంజనం లేదనియెరిగి జ్ఞాని వారిని కష్టములయం దాదుకొంటాడు.

ఆర్తసేవనం చేసేవారు ఆర్తులపట్ల కేవలం ఉపకార బుద్దితో చేస్తారను కోగూడదు. ఆర్తసేవయందు ఉపకార పరత్వం లేకపోలేదుగాని, నిజానికది సేవావ్రతులకు చిత్తశుద్దిని ప్రసాదిస్తుంది. ఉపకారం పొందినవారికి సంతుష్టి ఉండకపోగా, ఉపకరించినవారిపట్ల కృతజ్ఞతకూడా ఉండదు. నేను చేసినమేలు మరచిపోయినాడే వీడని నువ్వు ఆగ్రహం చెందగూడదు. వాని కృతఘ్నతయే నీ సంకల్పశుద్ధికి సాక్ష్యమని సంతోషించు. పరోపకారమనేది విడంబంకోసం, కీర్తికోసంకాదు. నీవుచేసిన మేలువల్ల ఎదుటివాని కేమిలాభం కలిగిందా అనే విచారణకు పోక, దానివలన నీ శీలమునకు, నీ ఆత్మకు కలిగిన లాభాన్ని తలచుకొని సంతుష్టి హించాలి.

సత్కర్మాచరణంవల్ల, మనశ్శరీరాల నదుపులో ఉంచు కొనుటవల్ల ఇటువంటి జ్ఞానం చేకూరుతుంది. నియమపూర్వకమైన ఈ సదాచరణం ఈశ్వరభక్తికి దారిచూపుతుంది. సకల భూతములందు భక్తుడీశ్వరునే దర్శిస్తాడు. భూతజాలమంతా అతనికీశ్వరుడే. ఈశ్వరుని సేవించినట్లే అతడు జీవకోటిని సేవిస్తాడు. అదే నిజమైన పరోపకారమంటే. పరోపకారనిరతి జ్ఞానానికి సాధనము, ఫలము కూడా అవుతుంది. దేవాలయము నకు గోపురాన్ని కట్టించినవాని మనస్సు ఆ గోపురమంత ఉన్నతము, విశాలము అవుతుంది. పరోపకారబుద్ధి లోకమంతట విస్తరించి, లోకాన్ని తనలో ఇముడ్చుకొంటుంది. విశ్వమంతటిని పరోపకారి తన కౌగిటిలోకితీసుకొని జగత్కుటుంబి అవుతాడు.

జ్ఞానుల సాంగత్యముగూడా జ్ఞానహేతు వవుతుంది. జ్ఞానులతో కలిసివుంటూ, వారు చేసే మంచిపనులుచూస్తూ, వాటిని గూర్చి చింతిస్తూవుంటే మనకుగూడా దయాధర్మమలు లలవడుతవి. మహాపురుషులసాన్నిధ్యము వేలకొలది ప్రజలను పరిశుద్ధులను చేసి ఉద్ధరిస్తుంది. అట్టి మహానీయులు సర్వమతము లందు, సకలదేశములందు. అపుడపుడు అవతరిస్తూఉంటారు. అట్టివారి ఉపదేశములన్నిటికీ సారమొక్కటే అయినా, తదనుయాయులు అభినివేశం కొద్దీ వాటిని మారుస్తారు. వాటికి మరికొన్నిటిని చేరుస్తారు. ధర్మసమయములుగా వాటిని కరుడు గట్టిస్తారు. వీరివల్లనే మానవజాతికి ఏకత్వంకరువైపోయి. భేదములు తలఎత్తుతూవుంటవి. మతకర్తలగు పూర్వాచార్యులు మళ్ళా అవతరిస్తారనుకోండి వారందరు కలియబలికికొంటా రనుకోండి. వారందరు బోధించిన సత్యమెక్కటే కనుకవారికి భేదభావమే పొడసూపదు.

కావున జ్ఞానమే సకల దుఃఖ నివారకం. ఎవరయ్యా జ్ఞాని? అంటే, తన దుఃఖములను తృణీకరించేవాడే అని చెప్పాలి. శ్రీ భగవత్పాదులు సెలవిచ్చినట్టు అట్టి జ్ఞానులు సకృత్తుగా వుంటారు.

''జంతూనాం నరజన్మ దుర్లభమతః

పుంస్త్వం తతో విప్రతా

తస్మాద్వైదిక ధర్మమార్గపరతా

విద్వత్వ మస్మాత్పరం -''

జంతువులందు నరుడు, వారిలో పురుషుడు, అందు విప్రుడు, వారిలో వైదిక ధర్మపరుడు, అందు విద్వాంసుడు దుర్లభులన్నారు.

అట్టి విద్వత్తకు వైదికధర్మమార్గ పర్వతము, ఈశ్వర భక్తీ కారణములవుతవి. ఈ రెంటిలో ఏది లోపించినా రెండవది వ్యర్థమే. ఈ రెంటి సమ్మేళనముచే సకలదుఃఖ నివారకమైన జ్ఞానం కలుగుతుంది. పరమేశ్వరి అట్టిజ్ఞానమును మనకు ప్రసాదించుగాక!